కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం, పెరుగుతున్న కేసులు, మరణాలు తదితర అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు చర్చించనున్నారు. జూన్ 17, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముందుగా నిర్ణయించిన రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం జరగనుంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక సీఎంలతో ప్రధాని మోదీ ఆరోసారి భేటీ కాబోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ జోన్స్ లో విధించిన లాక్డౌన్ గడువు జూన్ 30 తో ముగియనుంది. అలాగే లాక్డౌన్ సడలింపులు తర్వాత కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలో పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ప్రతిరోజు కరోనా మరణాలు సైతం పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ముగించాలా? లేక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి దేశంలో లాక్డౌన్ విధించాలా అనే అంశంపై ఈ సమావేశంలో సీఎంలతో ప్రధాని మోదీ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమునట్లుగా తెలుస్తుంది.
జూన్ 17న పీఎం మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:
- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- మహారాష్ట్ర
- తమిళనాడు
- ఢిల్లీ
- గుజరాత్
- రాజస్థాన్
- ఉత్తర్ ప్రదేశ్
- మధ్యప్రదేశ్
- పశ్చిమ బెంగాల్
- కర్నాటక
- బీహార్
- హర్యానా
- జమ్మూకాశ్మీర్
- ఒడిశా
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu